అక్షరటుడే గాంధారి: Electric Shock Death Incident | మేకలకు మేత తెచ్చేందుకు చెట్టెక్కి కరెంటు వైర్లకు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గాంధారి మండలంలో (Gandhari Mandal) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని వండ్రికల్ గ్రామానికి (Vandrikal Village) చెందిన వేముల కిషన్ (25) పోలుమత్తడి వాగు వద్ద మేకలకు మేతకోసం మేడిచెట్టు పైకి ఎక్కాడు.
Electric Shock Death Incident | విద్యుత్‌తీగలు తగలడంతో..
చెట్టుపై కొమ్మలు విరుస్తున్న సమయంలో విద్యుత్తీగల తగలడంతో కిషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గాంధారి పోలీస్‌స్టేషన్ (Gandhari Police Station) హెడ్‌కానిస్టేబుల్ రవికుమార్ తెలిపారు.