Homeజిల్లాలుకామారెడ్డిMinister Vakiti Srihari | డెయిరీ కళాశాలలో ఎంటెక్ కోర్సు మంజూరయ్యేలా కృషి చేస్తా

Minister Vakiti Srihari | డెయిరీ కళాశాలలో ఎంటెక్ కోర్సు మంజూరయ్యేలా కృషి చేస్తా

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Minister Vakiti Srihari | తెలంగాణలోనే కామారెడ్డిలో ఉన్న ఏకైక డెయిరీ కళాశాలలో (Dairy College) బీటెక్​తో పాటు ఎంటెక్ కోర్సు అమలయ్యేలా ఢిల్లీకి (Delhi) వెళ్లి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు.

శుక్రవారం ఆయన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తూ కామారెడ్డి పట్టణంలోని డెయిరీ కళాశాల, పాత రాజంపేట శివారులో ఉన్న విజయ డెయిరీని ఆకస్మిక తనిఖీ చేశారు.

డెయిరీ సరిహద్దులు గుర్తించాల్సిన అవసరం ఉందని వెంటనే కలెక్టర్​తో ఫోన్​లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయ డెయిరీ శిథిలావస్థలో ఉందని ఛైర్మన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా డెయిరీని త్వరలోనే ఆధునీకరిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డెయిరీ పరిశ్రమకు ఎంతోమందిని అందించిన గొప్ప కళాశాల అని కొనియాడారు.

సహకార వ్యవస్థ పటిష్టంగా ఉన్న కామారెడ్డి పాడి రైతుల సహకారంతో రాష్ట్రంలో పాలవెల్లువ తేవాలన్నారు. మంత్రి వెంట జీఎం మధుసూదన్, విజయ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, కిష్టారెడ్డి, నర్సింహారెడ్డి, డీడీ నాగేశ్వర్ రావు, కవిత, ధన్​రాజ్, లావణ్య, వైష్ణవి తదితరులు ఉన్నారు.