HomeUncategorizedDelhi Rains | ఢిల్లీలో వ‌ర్షాల ఎఫెక్ట్‌.. ఆల‌స్యంగా విమానాల రాకపోక‌లు

Delhi Rains | ఢిల్లీలో వ‌ర్షాల ఎఫెక్ట్‌.. ఆల‌స్యంగా విమానాల రాకపోక‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Delhi Rains | దేశ రాజ‌ధాని ఢిల్లీని dellhi rains అకాల వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. బ‌ల‌మైన గాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిస్తుండ‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

భారీ వర్షాలతో జ‌న జీవ‌నం స్తంభించింది. త‌ల్లితో పాటు ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రోవైపు, భారీ వర్షాలు, బ‌ల‌మైన గాలుల కార‌ణంగా విమాన రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. దేశంలోనే అత్యంత ర‌ద్దీగా ఉండే ఢిల్లీ ఎయిర్‌పోర్టు(Delhi Airport)లో విమాన ప్ర‌యాణాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. 120కి పైగా విమానాల రాక‌పోక‌లకు అంత‌రాయం క‌లిగింది. కొన్ని విమానాలు (Flights) గంట‌ల కొద్దీ ఆల‌స్యంగా బ‌య‌ల్దేరాయి. మ‌రికొన్నింటిని రీ షెడ్యూల్ చేశారు. మ‌రోవైపు, దాదాపు 40కి పైగా విమానాల‌ను దారి మ‌ళ్లించారు.

Delhi Rains | ప్ర‌యాణికుల అస‌హ‌నం..

వివిధ ప్రాంతాల‌కు వెళ్లాల్సిన ప్ర‌యాణికులు గంట‌ల కొద్దీ విమానాశ్ర‌యం(Airport)లోనే ప‌డిగాపులు కాశారు. రాక‌పోక‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌డంలో విమాన‌యాన సంస్థ‌లు, గ్రౌండ్ సిబ్బంది జాప్యం చేయ‌డంపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే, ఎయిర్‌పోర్టుకు వ‌చ్చే ముందే ప్ర‌యాణికులు త‌మ విమానాల స్టేట‌స్‌ను చెక్ చేసుకుని రావాల‌ని ఆయా విమానయాన సంస్థ‌లు అల‌ర్ట్ జారీ చేశాయి. “ఢిల్లీకి రాక‌పోక‌లు సాగించే మా విమానాలు కొన్ని ఆలస్యంగా న‌డుస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లించాల్సి వ‌స్తోంది. ఇది మా మొత్తం విమాన షెడ్యూల్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతరాయాలను తగ్గించడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము” అని ఎయిర్ ఇండియా(Air India) “ఎక్స్‌”లో తెలిపింది.

Delhi Rains | ఢిల్లీకి ఉప‌శ‌మ‌నం..

ఎండ‌వేడిమి, ఉక్క‌పోత‌తో అల్లాడిపోయిన ఢిల్లీ వాసుల‌కు తాజా వ‌ర్షాలు(Rains) భారీ ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. నిన్న‌, మొన్న‌టిదాకా ఉడికిపోయిన ఢిల్లీలో ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం(Weather) చ‌ల్ల‌బ‌డింది. మ‌రోవైపు, ఢిల్లీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) హెచ్చ‌రించింది. ఉరుములు మెరుపుల‌తో పాటు గంటకు 70 నుంచి 80 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ , ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.