Delhi Rains | ఢిల్లీలో వ‌ర్షాల ఎఫెక్ట్‌.. ఆల‌స్యంగా విమానాల రాకపోక‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్:Delhi Rains | దేశ రాజ‌ధాని ఢిల్లీని dellhi rains అకాల వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. బ‌ల‌మైన గాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిస్తుండ‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. భారీ వర్షాలతో జ‌న జీవ‌నం స్తంభించింది. త‌ల్లితో పాటు ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రోవైపు, భారీ వర్షాలు, బ‌ల‌మైన గాలుల కార‌ణంగా విమాన రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. దేశంలోనే అత్యంత ర‌ద్దీగా ఉండే ఢిల్లీ ఎయిర్‌పోర్టు(Delhi Airport)లో విమాన ప్ర‌యాణాల‌పై తీవ్ర ప్ర‌భావం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Delhi Rains | దేశ రాజ‌ధాని ఢిల్లీని dellhi rains అకాల వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. బ‌ల‌మైన గాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిస్తుండ‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

భారీ వర్షాలతో జ‌న జీవ‌నం స్తంభించింది. త‌ల్లితో పాటు ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రోవైపు, భారీ వర్షాలు, బ‌ల‌మైన గాలుల కార‌ణంగా విమాన రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. దేశంలోనే అత్యంత ర‌ద్దీగా ఉండే ఢిల్లీ ఎయిర్‌పోర్టు(Delhi Airport)లో విమాన ప్ర‌యాణాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. 120కి పైగా విమానాల రాక‌పోక‌లకు అంత‌రాయం క‌లిగింది. కొన్ని విమానాలు (Flights) గంట‌ల కొద్దీ ఆల‌స్యంగా బ‌య‌ల్దేరాయి. మ‌రికొన్నింటిని రీ షెడ్యూల్ చేశారు. మ‌రోవైపు, దాదాపు 40కి పైగా విమానాల‌ను దారి మ‌ళ్లించారు.

Delhi Rains | ప్ర‌యాణికుల అస‌హ‌నం..

వివిధ ప్రాంతాల‌కు వెళ్లాల్సిన ప్ర‌యాణికులు గంట‌ల కొద్దీ విమానాశ్ర‌యం(Airport)లోనే ప‌డిగాపులు కాశారు. రాక‌పోక‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌డంలో విమాన‌యాన సంస్థ‌లు, గ్రౌండ్ సిబ్బంది జాప్యం చేయ‌డంపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే, ఎయిర్‌పోర్టుకు వ‌చ్చే ముందే ప్ర‌యాణికులు త‌మ విమానాల స్టేట‌స్‌ను చెక్ చేసుకుని రావాల‌ని ఆయా విమానయాన సంస్థ‌లు అల‌ర్ట్ జారీ చేశాయి. “ఢిల్లీకి రాక‌పోక‌లు సాగించే మా విమానాలు కొన్ని ఆలస్యంగా న‌డుస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లించాల్సి వ‌స్తోంది. ఇది మా మొత్తం విమాన షెడ్యూల్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతరాయాలను తగ్గించడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము” అని ఎయిర్ ఇండియా(Air India) “ఎక్స్‌”లో తెలిపింది.

Delhi Rains | ఢిల్లీకి ఉప‌శ‌మ‌నం..

ఎండ‌వేడిమి, ఉక్క‌పోత‌తో అల్లాడిపోయిన ఢిల్లీ వాసుల‌కు తాజా వ‌ర్షాలు(Rains) భారీ ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. నిన్న‌, మొన్న‌టిదాకా ఉడికిపోయిన ఢిల్లీలో ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం(Weather) చ‌ల్ల‌బ‌డింది. మ‌రోవైపు, ఢిల్లీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) హెచ్చ‌రించింది. ఉరుములు మెరుపుల‌తో పాటు గంటకు 70 నుంచి 80 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ , ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...