అక్షరటుడే, వెబ్‌డెస్క్: Election Commission | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీపై ఎన్నికల సంఘం గురువారం మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాహుల్‌తో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలు ఎన్నికల పారదర్శకతపై దాడి చేయడమేనని పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఇండి కూటమి పార్టీలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడంపై గురువారం మరోసారి స్పందించింది. ఇటువంటి మురికి పదాలు పదేపదే తప్పుడు కథనాన్ని సృష్టించే లక్ష్యంతో ఉన్నాయని పేర్కొంది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై (Indian Voters) ప్రత్యక్షంగా దాడి చేయడమేనని, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతను శంకించడమేనని ఈసీ పేర్కొంది.
Election Commission | అఫిడవిట్ దాఖలు చేయండి..
భారతదేశంలో మొదటి ఎన్నికలు జరిగిన 1951-52 నుంచి “ఒక వ్యక్తికి ఒక ఓటు” చట్టం అమలులో ఉందని ఎన్నికల సంఘం (Election Commission) నొక్కి చెప్పింది. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేసినట్లు ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేయడం, ఓటర్లందరినీ “చోర్” అని ముద్ర వేయడానికి బదులుగా ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్‌ను సమర్పించాలని ఈసీ రాహుల్‌కు సూచించింది.
Election Commission | ఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు..
రాహుల్ గాంధీ కొంతకాలంగా ఎన్నికల కమిషన్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో కలిసి ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఆగస్టు 7న రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో (Press Conference) ప్రెజెంటేషన్‌ను నిర్వహించిన ఆయన.. కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో పెద్ద ఎత్తున “ఓటు చోరీ” (ఓటు దొంగతనం) జరిగిందని ఆరోపించారు, నకిలీ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు, ఒకే చిరునామాలలో బల్క్ రిజిస్ట్రేషన్లు వంటి పద్ధతుల ద్వారా లక్షకు పైగా ఓట్లు “దొంగిలించబడ్డాయని” ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ కోరింది. అయితే, డిక్లరేషన్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ ముందుకు రాలేదు. పైగా తన మాటే శాసనమని, ప్రజల మాటనే తాను చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న డేటానే మాత్రమే తాను చెబుతున్నానని తెలిపారు.