అక్షరటుడే, ఇందూరు : Duddolla Giribabu Campaign | తనను ఓటేసి గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాదేనని 47వ డివిజన్ బీజేపీ అభ్యర్థి (BJP Candidate) దుద్దోళ్ల గిరిబాబు అన్నారు. ఈ మేరకు కాలనీల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
Duddolla Giribabu Campaign | ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా..
ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని గిరిబాబు అన్నారు. డివిజన్‌కు సంబంధించిన ప్రతి సమస్యపై తనకు అవగాహన ఉందని, వాటి పరిష్కారంలో ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు (Drinking water problems), శివారు కాలనీలో రోడ్ల సమస్య ఉందని ఈ సమస్యల పరిష్కారానికి ప్రణాళికతో ముందుకు వెళ్తానని చెప్పారు.
బీజేపీ నాయకుల సహకారంతో..
నిజామాబాద్ అర్బన్‌లో (Nizamabad Urban) ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సహకారంతో డివిజన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానన్నారు. ప్రజా పథకాల అమలులో నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తానన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.