అక్షరటుడే, ఇందూరు: RTC Nizamabad | డ్రైవింగ్ అనేది వృత్తి కాదని.. అది ఒక బాధ్యత అని ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న (RTC Nizamabad Regional Manager Jyotsna) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో (RM office) బుధవారం డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాణాలు ఎంతో విలువైనవని, ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీస్తుందన్నారు. ప్రతి డ్రైవర్ బయలుదేరే ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాలన్నారు. వేగ పరిమితిని ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. రాత్రి ప్రయాణానికి ముందుగా తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ ఆర్ఎం మధుసూదన్ (Deputy RM Madhusudhan) మాట్లాడుతూ.. డ్రైవర్లు మొబైల్ ఫోన్ వినియోగించవద్దని, ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. వాహన తనిఖీ చేసుకున్న తర్వాతే బయలుదేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్–2 డిపో మేనేజర్ సాయన్న, జేబీఎస్ డీఎం రవితేజ, సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
