3
అక్షరటుడే, కోటగిరి: DPO Enquiry | ప్రజావాణిలో (prajavaani) వచ్చిన ఫిర్యాదు మేరకు మండలంలోని ఎక్లాస్పూర్(Eklaspur)లో డీపీవో శ్రీనివాస్ రావు(DPO Srinivas Rao) విచారణ చేపట్టారు. గ్రామంలో డ్రెయినేజీలను శుభ్రం చేయట్లేదని, తాగునీటి సమస్యలను కార్యదర్శి పట్టించుకోవట్లేదని పేర్కొంటూ గ్రామస్థుడు పడగల శంకర్ పటేల్ అనే వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం డీపీవో గ్రామానికి వచ్చి విచారణ చేశారు. ఆయన వెంట డీఎల్పీవో నాగరాజు(DLPO Nagaraju), ఇన్ఛార్జి ఎంపీడీవో చందర్ తదితరులున్నారు.