అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General Hospital) వైద్యులు అరుదైన చికిత్స నిర్వహించారు. ఓ వ్యక్తికి ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజను అత్యాధునిక పరికరాలతో శ్రమించి తొలగించగా ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. వారం రోజులుగా దగ్గు, దమ్ము, ఛాతినొప్పితో (chest pain) బాధపడుతున్న 27 ఏళ్లు వయస్సున ఓ వ్యక్తి పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జరనల్ ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులలో గింజ లాంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు.
పల్మనాలజిస్ట్ సాయి కృష్ణారావు (pulmonologist Sai Krishna Rao) ఆధ్వర్యంలో బ్రాంకో స్కోపి పరీక్ష ద్వారా ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తినేటప్పుడు శనగ గింజ (peanut) పొరపాటున ఊపిరితిత్తుల్లో ఇరుక్కుని ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రజలు తమకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని, అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా చికిత్స నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.