Homeక్రీడలుUppal stadium | అజార్ స్టాండ్ తొలగించవద్దు: హైకోర్టు

Uppal stadium | అజార్ స్టాండ్ తొలగించవద్దు: హైకోర్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Uppal stadium |ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) పేరును తొలగించే వ్యవహారంపై తెలంగాణ హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(Hyderabad Cricket Association)కు సూచించింది. స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరును తొలగించాలంటూ హెచ్‌సీఏ(HCA) అంబుడ్స‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఇటీవల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ తెలంగాణ హై కోర్ట్‌(Telangana High Court)ను ఆశ్రయించారు. తన పేరును తొలగించకుండా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌(HCA President)గా ఉన్న సమయంలో అజారుద్దీన్.. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లోని నార్త్ స్టాండ్‌కు తన పేరు పెట్టుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అజారుద్దీన్ ఏకపక్షంగా తీసుకున్నారని లార్డ్స్ క్రికెట్ క్లబ్ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అంబుడ్స‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య(Ombudsman Justice Easwariah.. అజారుద్దీన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, వెంటనే నార్త్ స్టాండ్‌కు ఆయన పేరును తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు.

టికెట్లపై కూడా అజారుద్దీన్ స్టాండ్(Azharuddin stand) అనే పేరు ఉండొద్దని తేల్చి చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించి తన వాదనలను వినిపించారు. దాంతో హై కోర్ట్(High Court).. అంబుడ్స్‌మన్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉండగా.. హెచ్‌సీఏ నిధుల్లో భారీ గోల్‌మాల్ జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది.