అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్‌గా నియమితులైన తెలంగాణ టెక్నలాజికల్ సర్వీసెస్ (Telangana Technological Services) మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ సత్యనారాయణ రెడ్డి బుధవారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమొక్క అందించి కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) స్వాగతం పలికారు.
Municipal Elections | ఎన్నికల ఏర్పాట్లపై చర్చ
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నిర్వహణకు చేసిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఇలా త్రిపాఠి అబ్జర్వర్‌కు తెలియజేశారు. నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనరల్ అబ్జర్వర్ కు ఫిర్యాదులు, సూచనలు చేయదలచిన వారు 95533 95000కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు. అలాగే mngdirector-tgts@telangana.gov.in ద్వారా కూడా తెలుపవచ్చని ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సూచించారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నోడల్ ఆఫీసర్ ఫర్ మైక్రో అబ్జర్వర్ సునీల్ తదితరులు ఉన్నారు.
Municipal Elections | నామినేషన్ల స్వీకరణ కేంద్రాల పరిశీలన
మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ మున్సిపల్ జోన్ ఆఫీస్, పూలాంగ్ టీటీడీ కల్యాణ మండపం, గౌతంనగర్, గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్, బడా బజార్ వాటర్ ట్యాంక్ తదితర కేంద్రాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా అని తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్‌లను పరిశీలించారు. టీపోల్ యాప్‌లో ఎన్నికల రిపోర్టులు అప్లోడ్ చేయాలని సూచించారు.