HCA President
HCA President | ఎస్​ఆర్​హెచ్​తో వివాదం.. హెచ్​సీఏ అధ్యక్షుడి అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: HCA President | సన్​ రైజర్స్ హైదరాబాద్(SRH)​, హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​(HCA)మధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్​సీఏ అధ్యక్షుడు (HCA President) జగన్మోహన్​రావును సీఐడీ (CID) బుధవారం అరెస్ట్​ చేసింది. ఐపీఎల్ (IPL)​ మ్యాచ్​ల సందర్భంగా ఎస్​ఆర్​హెచ్​ యాజమాన్యానికి, హెచ్​సీఏ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్​ఆర్​హెచ్​ యాజమాన్యం ఆరోపణలపై విచారణ జరిపిన సీఐడీ తాజాగా హెచ్​సీఏ ప్రెసిడెంట్​ జగన్మోహన్​రావును అరెస్ట్​ చేసింది.

HCA President | టికెట్ల కోసం బెదిరింపులు

ఐపీఎల్ ప్రాంచైజీ టీమ్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను టిక్కెట్ల కోసం హెచ్​సీఏ బెదిరించింది. ఈ మేరకు సన్​ రైజర్స్​ యాజమాన్యం గతంలోనే తీవ్ర ఆరోపణలు చేసింది. తమకు టికెట్లు కేటాయించలేదని హెచ్​సీఏ కార్పొరేట్​ బాక్స్​ ఆఫీస్​కు తాళం వేసిన విషయం తెలిసిందే. దీంతో తాము హైదరాబాద్​ వదిలి వేరే రాష్ట్రంలో మ్యాచ్​లు ఆడతామని ఎస్​ఆర్​హెచ్​ పేర్కొంది. దీంతో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఈ విషయమై సీరియస్​ అయ్యారు. విజిలెన్స్​ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

HCA President | విజిలెన్స్​ నివేదిక ఆధారంగా..

ఐపీఎల్​లో భాగంగా ఉప్పల్ (Uppal)​ వేదికగా జరిగిన ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​లకు ఆ జట్టు యాజమాన్యం 10 శాతం టికెట్లను హెచ్​సీఏకు ఉచితంగా ఇచ్చింది. అయితే మరో 10శాతం కావాలని హెచ్​సీఏ అధ్యక్షుడు జగన్మోహన్​రావు డిమాండ్​ చేశారు. దీనికి జట్టు ఒప్పుకోలేదు. దీంతో ఓపెన్​ మార్కెట్​లో కొనేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్​రావు కోరారు. హెచ్​సీఏ ద్వారా రిక్వెస్ట్​ పెట్టడంతో ఎస్​ఆర్​హెచ్​ ఓపెన్​ మార్కెట్​లో కొనడానికి మరో 10శాతం టికెట్లు కేటాయించింది.

తనకు వ్యక్తిగతంతో మరో 10శాతం టికెట్లు కావాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి ఫ్రాంచైజీ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వివాదం పెద్దదిగా మారింది. టికెట్లు ఇవ్వలేదని హెచ్​సీఏ కార్పొరేట్​ బాక్స్​ ఆఫీసుకు తాళం వేసింది. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరిపిన విజిలెన్స్​ అధికారులు (Vigilance officers) హెచ్​సీఏ ప్రెసిడెంట్ SRH మేనేజ్​మెంట్​పై టికెట్ల కోసం ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో హెచ్​సీఏపై కేసు నమోదు చేసిన సీఐడీ తాజాగా అధ్యక్షుడు జగన్మోహన్​రావును అరెస్ట్ చేసింది.