అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పారిశుధ్య కార్మికురాలి కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపల్ కార్మికులు (Municipal workers) డిమాండ్ చేశారు. అంబేడ్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న నాగమణిని సంగారెడ్డి డిపోకు (Sangareddy depot) చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయాలపాలైంది. గాయపడ్డ ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది.
Bodhan Municipality | సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట..
మృతి చెందిన కార్మికురాలి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మృతురాలికి రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాహతోకు (Sub-Collector Vikas Mahato) సమర్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాన్ని అందేలా చేస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

