అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srisailam Temple | శ్రావణ మొదటి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శివుడికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో (Shravana Masam) భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. అందులోనూ సోమవారం శివుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు రద్దీ పెరిగింది. శ్రావణ సోమవారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న (Vemulawada Temple) ఆలయానికి సైతం భక్తులు తరలి వచ్చారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గల త్రయంబకేశ్వర ఆలయానికి సైతం భారీగా భక్తులు వచ్చారు.
Srisailam Temple | కిటకిటలాడుతున్న ఆలయాలు
శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచాక్షరి మంత్రంలో మార్మోగుతున్నాయి. శ్రావణ మాసంలో శివుడిని పూజిస్తే మంచిదని భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. ఇందులో భాగంగా శివాలయాలకు బారులు తీరుతున్నారు.