అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Municipal Elections | పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madan Mohan) అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 6వ వార్డులో ప్రచారం నిర్వహించారు.
Yellareddy Municipal Elections | కౌన్సిలర్ అభ్యర్థులను ఆదరించాలి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ 6వ వార్డులో ప్రజలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అభ్యర్థి సయ్యద్ గఫార్ను గెలిపించి సమగ్రాభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడుగుతున్నామన్నారు. భవిష్యత్తులోనూ ఎల్లారెడ్డిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానన్నారు.
ఎల్లప్పుడూ ప్రజల కోసమే..
ఎల్లప్పుడూ తాను ప్రజల కోసం తపించేవాడినని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే కాలంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమానంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తానన్నారు. వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించుకుంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.