అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Bigala Ganesh Campaign | బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఆయన వర్ని చౌరస్తా ప్రాంతంలో ప్రచారం చేశారు. అనంతరం మాట్లాడారు.
రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని (BRS government) బిగాల అన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దేవుడు అందరికి ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. రాముడు కేవలం బీజేపీకి దేవుడు కాదన్నారు. తాము కూడా పూజలు చేస్తామన్నారు. దేవుడు పేరు చెప్పి ఓట్లు అడగడం బీజేపీకి అలవాటు అయిందని విమర్శించారు.
Bigala Ganesh Campaign | బతుకులు మారవు
బీజేపీ నిజామాబాద్ పేరు మారిస్తే మన బతుకులు మారవని బిగాల అన్నారు. తాము గెలిస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని ఎంపీ అర్వింద్ (MP Arvind) చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై బిగాల స్పందించారు. నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. తన హయాంలో నగరాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ అభ్యర్థి సర్ప రాజు, 8వ డివిజన్ అభ్యర్థి దండు శేఖర్, ఏడో డివిజన్ అభ్యర్థి బగ్గలి అజయ్, 50వ డివిజన్ అభ్యర్థి రంగు అపర్ణ, 27వ డివిజన్ అభ్యర్థి చెన్న సుధా తదితరులు పాల్గొన్నారు.