అక్షరటుడే, ఇందూరు: Neeta Arjun Rathod | తనను గెలిపిస్తే డివిజన్లోని పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని 34వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి నీత అర్జున్ రాథోడ్ హామీ ఇచ్చారు. డివిజన్లోని మిర్చి కాంపౌండ్, మార్వాడి గల్లీలో బుధవారం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నీత అర్జున్ రాథోడ్ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే డివిజన్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు పెళ్లికానుక అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా వంట సామాగ్రి అందించి అన్నలా అండగా ఉంటానని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులైన అందరికీ పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు అందించి ప్రజాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి చేసి డివిజన్ను ఉత్తమంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. డివిజన్ వాసులు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.