ePaper
More
    HomeFeaturesOne Crore Salary | 300 సార్లు రిజెక్ట్​ చేసినా.. ఆశ వదులుకోలేదు.. రూ.కోటి వేతనంతో...

    One Crore Salary | 300 సార్లు రిజెక్ట్​ చేసినా.. ఆశ వదులుకోలేదు.. రూ.కోటి వేతనంతో జాబ్​ కొట్టాడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: One Crore Salary | ప్రస్తుతం చాలా మంది యువత చిన్న చిన్న విషయాలకే ఆత్మ స్థైర్యం కోల్పోతున్నారు. మార్కులు (Marks) సరిగ్గా రాలేవని, పరీక్షల్లో ఫెయిల్​ అయ్యామని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు (Jobs) రాకపోవడంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు.

    తాము వెళ్లే మార్గంలో ఒకటి రెండు అవాంతరాలు ఎదురు కాగానే వెనుతిరుగుతున్నారు. తమతో కాదని కాడి కింద పడేస్తున్నారు. కానీ ఈ యువకుడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించారు. ఏకంగా 300 సార్లు తిరస్కరణకు గురైనా.. అనుకున్నది సాధించాడు. ఏకంగా రూ.కోటి వేతనంతో ఉద్యోగం సాధించాడు.

    బెంగళూరుకు (Bangalore) చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ (Engineering)​ పూర్తి చేశాడు. కంప్యూటర్ సైన్స్​ చదవాలని అనుకున్నా సీటు రాకపోవడంతో అతను ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​ చదివాడు. మొదటి నుంచి మనోడు చదువులో అంత చురుకేమి కాదు. బ్యాక్​లాగ్​లు కూడా ఉండేవి. అయితే మనోడికి బీటెక్​ పూర్తయ్యే సరికి ఫైనాన్స్​ సబ్జెక్టుపై ఆసక్తి ఏర్పడింది. దీంతో స్టాక్​ మార్కెట్​పై పట్టు పెంచుకున్నాడు. గ్లోబల్​ స్టాక్​ మార్కెట్ల (Stock Markets) పనితీరుపై అనేక విషయాలు నేర్చుకున్నాడు.

    One Crore Salary | జాబ్​ వచ్చినా..

    బీటెక్​ పూర్తయిన తర్వాత ఆ యువకుడిని క్యాంపస్​ ప్లేస్​మెంట్​లో జాబ్​ వచ్చింది. రూ.7.5 లక్షల ప్యాకేజీతో కొలువు వచ్చింది. కానీ మనోడికి మార్కెట్లపై మనసు పడడంతో దానిని తిరస్కరించాడు. ఫైనాన్షియల్‌ రంగంలోనే కెరియర్‌ ప్రారంభించాలని కలలు కన్నాడు. ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కోసం ఎన్నో దరఖాస్తులు చేశాడు. ఏకంగా 300 సార్లు మనోడిని ఆయా కంపెనీలు రిజెక్ట్​ చేశాయి.

    దీంతో ఫైనాన్షియల్‌ మోడలింగ్, కంపెనీ వాల్యూయేషన్‌ లాంటి కోర్సులు కూడా చేశాడు. ఎట్టకేలకు ఆ యువకుడికి క్వాంట్‌ రీసెర్చ్‌ (Quant Research) అనే కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి అవకాశం వచ్చింది. అప్పటికే మంచి ఆకలితో ఉన్న యువకుడు ఏడాదిలో షేర్​ మార్కెట్​ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాడు. దీంతో లండన్‌కు చెందిన ఒక ట్రేడింగ్‌ ఫర్మ్‌ రూ.1.03 కోట్ల వేతనంతో అతడిని ఉద్యోగంలోకి తీసుకుంది.

    One Crore Salary | అనుకున్నది సాధించాడు

    ఆ యువకుడు బీటెక్​ చేసిన తనకు నచ్చిన రంగంలో కొలువు సాధించడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా.. కొత్త అంశాలు నేర్చుకుంటూ ఉన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 300 సార్లు అప్లికేషన్లు రిజెక్ట్​ అయినా మొక్కవోని సంకల్పంతో ప్రయత్నించాడు. దీంతో ఆయన శ్రమకు ఫలితం తగ్గింది. రూ. కోటి వేతనంతో జాబ్​ దొరికింది. బెంగళూరుకు చెందిన ఆ యువకుడు పేరు చెప్పకుండా తన సక్సెస్​ స్టోరీ పంచుకున్నాడు. యువత చిన్న చిన్న కారణాలకు నిరాశ చెందకుండా ప్రయత్నిస్తే ఇలా విజయాలు వరిస్తాయని పలువురు అంటున్నారు.

    Latest articles

    Kamareddy | కుక్కను తప్పించబోయి డివైడర్ ను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | హైదరాబాద్ (Hyderabad) నుంచి వస్తున్న కారు కుక్కను (dog) తప్పించబోయి డివైడర్ ను...

    Stree Shakti Scheme | ఏపీలో ఉచిత బస్సు ప్ర‌యాణం మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండర్స్‌కే కాదు.. వారంద‌రికి వ‌ర్తిస్తుంది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stree Shakti Scheme | ఎన్నిక‌ల హామీలో భాగంగా ప్రకటించిన ఉచిత బస్ ప్రయాణ...

    Hero Ram | ఆ హీరోయిన్‌తో రామ్ డేటింగ్‌.. ఇదే సాక్ష్యం అంటున్న నెటిజ‌న్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hero Ram | తెలుగు ప్రేక్షకులను ‘మిస్టర్ బచ్చన్’ తో అలరించిన నూతన కథానాయిక భాగ్యశ్రీ...

    Intelligence Bureau | ఏపీలో ఉగ్ర క‌ద‌లిక‌లు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఐబీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau | పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ వ్య‌క్తిని...

    More like this

    Kamareddy | కుక్కను తప్పించబోయి డివైడర్ ను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | హైదరాబాద్ (Hyderabad) నుంచి వస్తున్న కారు కుక్కను (dog) తప్పించబోయి డివైడర్ ను...

    Stree Shakti Scheme | ఏపీలో ఉచిత బస్సు ప్ర‌యాణం మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండర్స్‌కే కాదు.. వారంద‌రికి వ‌ర్తిస్తుంది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stree Shakti Scheme | ఎన్నిక‌ల హామీలో భాగంగా ప్రకటించిన ఉచిత బస్ ప్రయాణ...

    Hero Ram | ఆ హీరోయిన్‌తో రామ్ డేటింగ్‌.. ఇదే సాక్ష్యం అంటున్న నెటిజ‌న్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hero Ram | తెలుగు ప్రేక్షకులను ‘మిస్టర్ బచ్చన్’ తో అలరించిన నూతన కథానాయిక భాగ్యశ్రీ...