HomeజాతీయంDelhi Blast Case | ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక మలుపు.. DNA ద్వారా...

Delhi Blast Case | ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక మలుపు.. DNA ద్వారా నిందితుడి గుర్తింపు

ఢిల్లీలో కారు పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Blast Case | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని DNA పరీక్షల (DNA Tests) ద్వారా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.

ఈ పేలుడులో 12 మంది మృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. దర్యాప్తు బృందాలు ఉమర్ తల్లి DNA నమూనాలను, ఘటనా స్థలంలో కారు నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలు, దంతాలతో సరిపోల్చగా, అవి పూర్తిగా సరిపోయాయి. పేలుడు జరిగిన క్షణంలో ఉమర్ కాలు స్టీరింగ్ వీల్, యాక్సిలరేటర్ మధ్య చిక్కుకుపోయినట్లు కూడా తేలింది. దీంతో కారును నడిపింది ఉమరేనని స్పష్టమైంది.

Delhi Blast Case | వరుస పేలుళ్లకు ప్రణాళిక

దర్యాప్తులో అరెస్టయిన ఇతర ఉగ్రవాద అనుమానితులు.. డాక్టర్ ఉమర్ దేశాన్ని కుదిపేసే స్కెచ్ వేశాడ‌ని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. జైష్-ఏ-మొహమ్మద్ (Jaish-e-Mohammed) మాడ్యూల్ ఆధ్వర్యంలో ఉమర్ బృందం నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో (National Capital Region) పాటు దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లకు ప్రణాళికలు రూపొందించింది. ఇటీవల పోలీసులు పలు రాష్ట్రాల్లో దాడులు చేసి పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో, ఉమర్ ప్రణాళిక ముందుగానే బయటపడే ప్రమాదాన్ని గ్రహించి, తొందరగా దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఉమర్, అతని సహచరులు ఐఈడీలు, అసాల్ట్ రైఫిళ్లు ఉపయోగించి భారీ దాడులు చేయడానికి మూడు వాహనాలు కొనుగోలు చేసినట్లు రిపోర్టులు వెల్లడించాయి.

ఫరీదాబాద్‌లో (Faridabad) స్వాధీనం చేసుకున్న ఎర్ర రంగు ఎకోస్పోర్ట్ కారును మరో ఉగ్రవాది డాక్టర్ ముజమ్మిల్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడులో ఉపయోగించిన కారు అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ ఉన్ నబీ ఉగ్రవాద చర్యల్లో పాల్గొనడం కుటుంబానికి నమ్మశక్యం కావడం లేదు. ఉమర్ వదిన ముజామిల్ మాట్లాడుతూ ..“ఉమర్ చాలా సైలెంట్ వ్యక్తి. చిన్నప్పటి నుంచి చదువుపై దృష్టి పెట్టేవాడు. ఫరీదాబాద్‌లో లెక్చరర్‌గా పనిచేస్తూ.. ఇంటికి త్వరలో వస్తానని చెప్పాడు. అతను ఇలాంటి చర్యల్లో పాల్గొనడం మాకు షాక్ ఇచ్చింది,” అని తెలిపారు. ప్రస్తుతం UAPA (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం), Explosives Act కింద కేసు నమోదు కాగా.. ఈ దర్యాప్తును కేంద్ర హోంశాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి (National Investigation Agency) అప్పగించింది.

Must Read
Related News