అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi capitals | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Mega Power Star Ram Charan నటిస్తున్న తాజా చిత్రం పెద్ది Peddi. ఈ మూవీ బుచ్చిబాబు Buchi Babu దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇటీవల చిత్రం నుండి గ్లింప్స్ విడుదల కాగా, ఇది నెటిజన్స్‌ని, సినీ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ Ram Charan ఆడిన ఓ షాట్ వేరే లెవల్ అని చెప్పాలి. పెద్ది కొట్టిన షాట్‌కు బాల్ బౌండరీ దాటినట్టుగా.. ఈ సినిమా బౌండరీస్‌ను దాటేలా ఉంది. రామ్ చరణ్‌ను ఇంత రా, రస్టిక్‌గా raw and rustic చూపించిన బుచ్చిబాబుని ఆయన ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పెద్ది ఫస్ట్ షాట్‌లో first shot రామ్ చరణ్ Ram Charan కనిపించిన తీరు, డైలాగ్స్ చెప్పిన తీరు, యాసను పలికించిన విధానం, చివర్లో మాస్ షాట్‌కి అంతా ఫిదా అయ్యారు.
Delhi capitals | అదిరిపోయింది..
పెద్ది గ్లింప్స్ Peddi glimpse తర్వాత ఇందులోని క్రికెట్ Cricket షాట్‌ని చాలా మంది అనుకరిస్తున్నారు. తాజాగా ఢిల్లీ బ్యాట్స్‌మెన్ Delhi batsman కూడా ఆ షాట్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈరోజు ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ Sunrisers Hyderabad (ఎస్ఆర్‌హెచ్), ఢిల్లీ క్యాపిటల్స్ delhi capitals (డీసీ) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో డీసీ టీమ్ DC team విడుదల చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ ‘Peddi’ Glimps ఆడియోతో ఈ వీడియోను ఎడిట్ చేశారు. ఇందులో రామ్‌చరణ్ కొట్టిన షాట్‌ను ఢిల్లీ ఆటగాడు సమీర్ రిజ్వీ Sameer Rizvi రీక్రియేట్ చేశాడు. దీన్ని ఢిల్లీ క్యాపిటల్స్ Delhi player తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయగా… పెద్ది టీమ్ రీట్వీట్ చేసింది. ఇప్పుడీ వీడియో video సామాజిక మాధ్యమాల్లో వైరల్ viral అవుతోంది. దీనిపై మెగా అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ cricket fans, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ Sunrisers Hyderabad ఓడితే ప్లే ఆఫ్స్ రేసు play-off race నుంచి అధికారికంగా తప్పుకుంటుంది. గెలిస్తే మాత్రం ఇంకా రేసులోనే ఉంటుంది. అయితే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ play-off చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్ ల్లో గెలవడమే కాకుండా ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ Sunrisers గెలవాలంటే జట్టులో భారీ మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా వరుసగా విఫలం అవుతున్న ముగ్గురు ప్లేయర్లపై వేటు పడాల్సి ఉంది. ఇషాన్ కిషన్ ishan kishan, మొహమ్మద్ షమీ shami, జీషాన్ అన్సారీలను Zeeshan Ansari తుది జట్టు నుంచి తప్పించాల్సి ఉంది. వీరి స్థానాల్లో స్మరన్ రవిచంద్రన్, సిమర్ జీత్ సింగ్, రాహుల్ చహర్‌లను ఆడించాలి అని అంటున్నారు.
Bas ek hi kaam hai – fight for Dilli 🔥👊 pic.twitter.com/KwwpumhE5y
— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2025