అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by Election) పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. లంకల దీపక్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పలు రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ స్థానం నుంచి దీపక్‌రెడ్డి (Deepak Reddy)కి అవకాశం ఇచ్చింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో దీపక్‌రెడ్డి వైపు కేంద్ర నాయకత్వం మొగ్గు చూపింది. కాగా దీపక్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు 25 వేల ఓట్లు వచ్చాయి. తాజాగా మరోసారి బరిలో నిలవనున్నారు.
Jubilee Hills | రసవత్తరంగా పోరు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నవంబర్ 11న జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ సైతం దీపక్‌రెడ్డిని బరిలో దింపుతున్నట్లు తెలిపింది. బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత (Maganti Sunitha) పోటీ చేస్తున్నారు. ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. కాంగ్రెస్ నుంచి బీసీ కులానికి చెందిన నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తాజాగా కమలం పార్టీ రెడ్డికి అవకాశం ఇచ్చింది. మడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.