అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shubman Gill | భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కూతురు సారా టెండూల్కర్(Sara Tendulkar)తో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) స్పందించాడు. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన కెరీర్‌పై మాత్రమే ఫోకస్ పెట్టానని చెప్పాడు. సారా టెండూల్కర్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ సారా అలీఖాన్, రిద్ధిమా పండిట్, అవనీత్ కౌర్‌లతో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు పుకార్లు వెలువడ్డాయి. అయితే ఎక్కువగా సారా టెండూల్కర్ పేరే వినిపించింది.
ఈ ఇద్దరి ప్రేమను సచిన్ టెండూల్కర్ కూడా ఒప్పుకున్నాడని, అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరిగింది. శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఆడే మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరవ్వడం.. టీవీ కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం ఈ డేటింగ్ వార్తలకు బలం చేకూర్చింది. అంతేకాకుండా గిల్ సోదరితో సారా టెండూల్కర్ నైట్ పార్టీలకు హాజరవ్వడం కూడా ఈ వార్తలు నిజమేనని అనుకునేలా చేశాయి.
ఐపీఎల్(IPL) 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్(Gujrath Tiatans)కు సారథ్యం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డేటింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై గిల్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎప్పుడూ కలవని, చూడని వ్యక్తులతో కూడా లింకులు పెట్టి ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు.
‘నేను గత మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నా. ఎవరితో డేటింగ్‌లో లేను. కానీ అనేక పుకార్లను పుట్టించి ప్రచారం చేశారు. నేను చూడని, కలవని వ్యక్తులతో కూడా లింక్ పెట్టి పుకార్లు వ్యాప్తి చేశారు. ప్రస్తుతం నా కెరీర్(Career)పైనే ఫోకస్ పెట్టాను. పెళ్లి, డేటింగ్ అనేవాటికి నేను దూరంగా ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో డేటింగ్ చేసే సమయం కూడా నాకు లేదు.’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
