అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | వర్షాల కారణంగా ధ్వంసమైన వంతెనలకు మరమ్మతులు చేయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Former MLA Jajala Surender) నివాసంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రకృతి విపత్తు కారణంగా ఎంతోమంది రైతులు నష్టపోయారన్నారు. అలాగే వందలమంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి (Yellareddy) నుండి మెదక్ (Medak), బాన్సువాడ (banswada), కామారెడ్డి (Kamareddy), నిజాంసాగర్ (Nizamsagar) దారులన్నీ నీటితో మునిగిపోవడంతో రవాణా పూర్తిగా స్పందించిందని వివరించారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఆస్తినష్టం జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
Yellareddy | సీఎం ఆదేశాలు ఇచ్చినా..
నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని పేర్కొన్నప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో స్పందించలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. స్వయంగా సీఎం వచ్చినా పనుల్లో వేగం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోచారం ప్రాజెక్టు నుంచి కాల్వల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
లింగంపేట (Lingampet) మండలంలోని లింగంపల్లి వంతెన పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు నర్సింలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు సాయిలు, శ్రవణ్ కుమార్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, రాజయ్య సొసైటీ డైరెక్టర్లు దేవదాస్, అరవింద్ గౌడ్, యువజన నాయకుడు దయాకర్, దళిత నాయకుడు బబ్లు పృథ్వీరాజ్, నాగరాజ్, రవితో పాటు తదితరులు పాల్గొన్నారు.