అక్షరటుడే, అమరావతి: DA for employees | రాష్ట్ర అభివృద్ధిలో సర్కారు ఉద్యోగులు employees కీలక భాగస్వామ్యులు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister Chandrababu Naidu) పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత సమస్యలను సరిదిద్దే సమయంలోనే సర్కారు మారిందని సీఎం చెప్పారు. దీంతో సమస్యలు ఎక్కడివక్కడే ఉండిపోయాయన్నారు.
ఏపీలో రూ.7 వేల కోట్ల DA పెండింగ్ లో ఉందన్నారు. రూ. 830 కోట్ల సరెండర్ లీవ్ బకాయిలు ఉండిపోయాయని తెలిపారు. గత సర్కారు హయంలో చోటుచేసుకున్న విధ్వంసాన్ని సరి దిద్దడానికి 15 నెలలు పట్టిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు ఒక డీఏ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. అందులో ఒకటి ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
నవంబరు 1 నుంచి రాష్ట్ర ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. దీనివల్ల ప్రతి నెల రూ.160 కోట్ల అదనపు భారం పడుతుందని చంద్రబాబు తెలిపారు.
DA for employees | 180 days చైల్డ్ కేర్ లీవ్స్
ఇక మహిళా ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయం ప్రకటించారు. చైల్డ్ కేర్ లీవ్స్‌ను 180 రోజులకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ చైల్డ్ కేర్ సెలవులను రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు కల్పించారు.
రాష్ట్ర రెవెన్యూలో 99.50 శాతం మొత్తం ఉద్యోగుల జీతభత్యాలకే వెళ్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల జీతాలకే రూ.51,200 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు.
ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం రూ.51,400 కోట్లు వస్తే.. జీతాల రూపేణ రూ. 51,200 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 99 శాతం రెవెన్యూ HR కే వెళ్తున్నట్లు చెప్పారు.