అక్షరటుడే, ఇందూరు: Heavy rain : నిజామాబాద్ నగరంలో rains in nizamabad భారీ వర్షం కుమ్మేస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షం తడిచి ముద్ద చేస్తోంది.
బలమైన గాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోని నాలాలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.