Bharat Summit | తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటాలి: సీఎం

అక్షరటుడే, హైదరాబాద్:  Bharat Summit : సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రజా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు కావాలని భారత్ సమ్మిట్ bharat summit 2025 వేదికగా ప్రపంచ దేశాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి cm revanth reddy విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన సంస్కరణలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా rizing బ్రాండ్ […]

అక్షరటుడే, హైదరాబాద్:  Bharat Summit : సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రజా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు కావాలని భారత్ సమ్మిట్ bharat summit 2025 వేదికగా ప్రపంచ దేశాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి cm revanth reddy విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన సంస్కరణలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా rizing బ్రాండ్ ambassidors రాష్ట్ర గొప్పతనాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటాలన్నారు.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ Lop Rahul Gandhi, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క bhatti vikramarkaతో పాటు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన భారత్‌ సమ్మిట్‌ వేదికగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధిస్తున్న ప్రగతి, సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.

“విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళల నాయకత్వంలో దశాబ్దాల పాటు జరిగిన పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మొదటి దశాబ్దంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ఏర్పడిన నిరాశను తొలగించడానికి ఆయా వర్గాల ఆశలను నెరవేర్చే స్పష్టమైన లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది.

ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. రూ.20 వేల కోట్లతో 25 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేశాం. సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్తుతో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 12 వేల పంట పెట్టుబడి సహాయం, భూమి లేని వ్యవసాయ కార్మికుల కుటుంబానికి రైతు భరోసా మద్దతుని ప్రభుత్వం అందిస్తోంది.

ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాపై రూ.500 అదనపు బోనస్ అందిస్తూ రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం.

యువతకు నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని స్థాపించాం. గతంలో ఉద్యోగ నియామకాలు లేని పరిస్థితిని సవరిస్తూ, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 5 లక్షల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం.

దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లలో పెట్టుబడి సమ్మిట్ల ద్వారా రాష్ట్రానికి రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. వీటి ద్వారా ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నాం. తెలంగాణ వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, అత్యధిక సొంత పన్ను వసూళ్లు, జీసీసీలు, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల electric vehicles రంగాల్లో అభివృద్ధితో పాటు దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని యత్నిస్తున్నాం.

తెలంగాణ సంస్కృతిలో మహిళలకు సమాన గౌరవం ఉండాలన్న లక్ష్యంతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, రూ. 500 కే గ్యాస్ సిలిండరు, రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నాం.

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులను కోటికి పెంచే లక్ష్యంతోపాటు వారిని కోటీశ్వరులను చేయాలనే ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ప్రయత్నంలో మహిళలకు సోలారు పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోలు బంకులు, ప్రీమియం రిటైలు ఔట్‌లెట్లలో షాపులు, సోలారు విద్యుత్తు ఉత్పత్తి, బస్సులను కేటాయించడం వంటి అనేక చర్యలు చేపట్టాం.

విద్య, ఆరోగ్యం ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్సకయ్యే ఖర్చును రూ. 10 లక్షలకు పెంచాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సహాయం అందించాం. కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరానికి విముక్తి కల్పించడానికి మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టాం. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులు చేపడుతున్నాం.

ఓబీసీ జనగణన చేసి దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పూర్తి చేయడంలో దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణయే. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించడానికి పారదర్శకమైన పద్ధతిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సరికొత్త సంక్షేమ విధానాన్ని రూపొందిస్తున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...