ePaper
More
    HomeతెలంగాణCompensation | రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం.. పరిహారం అందేనా

    Compensation | రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం.. పరిహారం అందేనా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Compensation | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగస్టు 26 రాత్రి నుంచి 28 వరకు కురిసిన కుండపోత వానత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని కామారెడ్డి (Kamareddy), మెదక్ (Medak)​, నిజామాబాద్ (Nizamabad)​, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలలో తీవ్ర నష్టం వాటిల్లింది.

    రోడ్లు కొట్టుకుపోయి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చెరువులు తెగిపోవడం, రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు వాగులు ఉధృతంగా పారడంతో పొలాల్లో ఇసుక మేటలు పెట్టింది. పలు చోట్ల రాళ్లు రప్పలు చేరాయి. దీంతో ఈ ఏడాది పంట నష్ట పోవడంతో పాటు ఆ భూమిని సాగులోకి తేవడానికి భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

    Compensation | కేంద్రానికి నివేదిక

    రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టంపై వ్యవసాయ అధికారులు (Agricultural officials) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు.

    Compensation | పరిహారం ఇవ్వాలి

    రాష్ట్రంలో వరదల ధాటికి పలువురు మృతి చెందారు. వందల సంఖ్యలో పశువులు సైతం మరణించాయి. వరదల్లో మృతి చెందిన వారికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. అలాగే పశువులకు సైతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. వరదలో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం నిధులు సైతం విడుదల చేసింది. అయితే పంట నష్టపోయిన రైతులకు (farmers) పరిహారంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

    More like this

    Stock Markets | ఎగసి ‘పడి’.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | జీఎస్టీ సరళీకరణతో భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌...

    GST on gold | బంగారంపై జీఎస్టీ ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: GST on gold | కేంద్ర ప్రభుత్వం(Central government) జీఎస్టీ సంస్కరణలు చేపట్టి సామాన్యులకు పండుగ...

    GST | ‘కారు’ చౌక!..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: GST | జీఎస్టీ లో తీసుకువచ్చిన సంస్కరణలతో చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి. నాలుగు మీటర్ల...