అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cricket tournament | జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో (Police Parade Ground) సీపీ టీం వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్ టీం మధ్య క్రికెట్ మ్యాచ్ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ పోటీలో సీపీ టీం విజయం సాధించింది.
టాస్ గెలిచిన పోలీస్ టీం (Police team) బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో జట్టు మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించింది. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkat Reddy) 25 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రెస్ క్లబ్ జట్టు (Press Club team) 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది.
Cricket tournament | సీపీ బౌలింగ్ హైలెట్..
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) 3 ఓవర్లు బౌలింగ్ వేసి ప్రతి ఓవర్లోడ ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు. ఆయన బౌలింగ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అదనపు డీసీపీ బస్వారెడ్డి ఒక ఓవర్ వేసి ఒక వికెట్ తీశారు. ప్రెస్ క్లబ్ జట్టులో శివ ఠాగూర్ అద్భుతమైన బ్యాటింగ్ వేసి 24 పరుగులు చేశారు. 43 పరుగుల తేడాతో పోలీస్ జట్టు ప్రెస్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బెస్ట్ బౌలర్‌గా శ్యామ్, ఉత్తమ బ్యాట్స్‌మన్ కిరణ్‌లకు సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బహమతులు అందజేశారు.