అక్షరటుడే, డిచ్పల్లి: CP Sai Chaitanya | అదుపుతప్పి రోడ్డుపై పడి ఓ వ్యక్తి గాయపడగా.. అటువైపుగా వెళ్తున్న సీపీ వెంటనే స్పందించారు. బాధితుడిని త్వరితగతిన వైద్యసాయం అందేలా చొరవ చూపారు.
వివరాల్లోకి వెళ్తే.. డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ (Dichpally Police Station) పరిధిలోని నడిపల్లి (Nadipally) గ్రామ శివారులోని బైక్‌పై వెళ్తున్న అశోక్ గాబ్రి అదుపుతప్పి రోడ్డుపక్కన పడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని అటువైపుగా వెళ్తున్న సీపీ సాయిచైతన్య చూసి వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడిని పరామర్శించారు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి అతడిని జీజీహెచ్‌కు (GGH Nizamabad) తరలించే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు.