అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipality | ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి అధికారులు హద్దుమీరుతున్నారు. సామాన్యుల నుంచి డబ్బులు వసూలు (collecting money) చేస్తున్నట్లు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. చేతులు తడిపితేనే కార్యాలయంలో పనులు అవుతాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా మున్సిపల్లో (municipality) పనిచేసే డ్రైవర్ల దగ్గరే ఓ ఉద్యోగి ముక్కుపిండి మరీ డబ్బులు లాగుతున్నాడు.
ఆర్మూర్ పట్టణంలో (Armoor town) చెత్త సేకరించే వాహనాల డ్రైవర్ల (drivers) జీతాలు పెంచుతానని చెప్పి బల్దియాలో పని చేసే ఓ ఉద్యోగి మామూళ్లు వసూలు చేశాడు. ఈ విషయం ప్రస్తుతం పట్టణంలో తీవ్ర చర్చకు దారి తీసింది. బల్దియాలో పని చేసే సుమారు 20 మంది డ్రైవర్లు (drivers), ఇద్దరు బిల్ కలెక్టర్ల నుంచి సదరు అధికారి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.35 వేల నుంచి రూ.40వేల వరకు తీసుకున్నట్లు తెలిసింది.
Armoor Municipality | జీతాలు పెంచినా..
డ్రైవర్లు (drivers), బిల్ కలెక్టర్ల (bill collectors) నుంచి డబ్బులు వసూలు చేసిన అధికారి చెప్పినట్లుగానే జీతాలు పెంచాడు. వారి వేతనాలను రూ.14,684 నుంచి రూ.19,500 చేశాడు. రెండు నెలల పాటు పెరిగిన వేతనాలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే మూడో నెల మాత్రం పాత వేతనం జమ కావడంతో ఉద్యోగులు (employees) ఆందోళన చెందుతున్నారు. జీతాల కోసం డబ్బులు చెల్లిస్తే పాత జీతాలే రావడంతో లబోదిబోమంటున్నారు. దీనిపై సదరు అధికారిని డబ్బుల విషయమై ప్రశ్నించగా మాట దాట వేసినట్టు సమాచారం.
Armoor Municipality | అందుకే పాత జీతాలు వేశాం..
- రాజు, మున్సిపల్ కమిషనర్, ఆర్మూర్
ప్రభుత్వ జీవో ప్రకారం వాహనాల డ్రైవర్లకు జీతాలు పెరుగుతాయి. అయితే ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారినట్లు నా దృష్టికి వచ్చింది. దీంతో పెంచిన జీతాలు నిలిపి వేసి పాత వేతనాలనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశాం. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
1 comment
[…] జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ Armur Municipality పరిధిలో […]
Comments are closed.