Covid
Covid |

అక్షరటుడే, ఇందూరు: Covid case :నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లో కరోనా(Corona) పాజిటివ్ కేసు వెలుగుచూసింది. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్​ కాలనీ(Ambedkar Colony)కి చెందిన ఓ వ్యక్తికి రెండు రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం కావడంతో శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)Government General Hospital – GGHకు వచ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్టు(rapid test) చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది.

సూపరింటెండెంట్(Superintendent) డాక్టర్ శ్రీనివాసుకు వైద్యులు సమాచారం అందించడంతో జీజీహెచ్​ 7వ అంతస్తులోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 2020 లో కూడా సదరు వ్యక్తికి కొవిడ్ సోకినట్లు సమాచారం.