అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mudiraj Caste | ముదిరాజ్ కులస్తుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ (Telangana Mudiraj Mahasabha) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం (Yellareddy mandal) అజామాబాద్ గ్రామంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.
Mudiraj Caste | ముదిరాజ్ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై..
ముదిరాజ్ కులస్తులకు (Mudiraj community) జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరముందని బట్టు విఠల్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2026 వరకు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాల్లో ముదిరాజ్ జెండాల ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఐక్యఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.
Mudiraj Caste | 2025 సర్పంచ్ ఎన్నికల్లో..
2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 65 మంది సర్పంచులు, 172 మంది ఉపసర్పంచులు, 364 మంది వార్డు సభ్యులు గెలుపొందడం ముదిరాజ్ ఐక్యతకు నిదర్శనమన్నారు. బీసీ–ఏ సాధన కోసం ర్యాలీలు, ధర్నాలు, కలెక్టర్ కార్యాలయ ముట్టడులు, భారీ బహిరంగ సభలు నిర్వహించామని, అట్రాసిటీ కేసుల అంశంలో అంబేడ్కర్ సంఘాలతో సమన్వయం వల్ల కేసులు తగ్గాయని తెలిపారు. 78 గ్రామాల్లో మత్స్యశాఖలో 689 మందికి సభ్యత్వాలు కల్పించడం ఉద్యమ విజయంగా పేర్కొన్నారు.
Mudiraj Caste | స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో..
రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ముదిరాజ్ కులస్తుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ–ఏ గ్రేడ్ సాధించే వరకు పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు యాదయ్య, ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు ప్యాలాల రాములు, జిల్లా యువజన కార్యదర్శి వెల్లుట్ల సంతోష్ కుమార్, మండల యూత్ ఉపాధ్యక్షులు నీల రవి, లక్ష్మణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.