అక్షరటుడే, మెండోరా : Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (Sriramsagar Project)కు ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 9,454 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు అంతే మొత్తంలో ఔట్ ఫ్లో మెయింటెన్ చేస్తున్నారు.
ఇన్‌ఫ్లో తగ్గడంతో వరద గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 650, మిషన్ భగీరథ (Mission Bhagiratha)కు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంది.
Sriram sagar | నిజాంసాగర్‌కు..
అక్షరటుడే, ఎల్లారెడ్డి : నిజాంసాగర్ జలాశయానికి (Nizamsagar Reservoir) ఎగువ నుంచి స్వల్పంగా వరద వస్తోంది. ప్రస్తుతం 2,498 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఒక గేటు ఎత్తి అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది.
