అక్షరటుడే, వెబ్‌డెస్క్: constable murder case | కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ ప్రమోద్ Constable Pramod దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
వివిధ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఠాణాకు తరలిస్తుండగా.. కానిస్టేబుల్ ప్రమోద్పై నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ప్రమోద్ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి మరణించారు. కాగా, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కమిషనరేట్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు.
ఈ నేపథ్యంలో శనివారం (అక్టోబరు 18) ఉదయం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఐజీ చంద్రశేఖర్రెడ్డి IG Chandrasekhar Reddy.. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. సీపీ సాయి చైతన్యతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియల్లో ఐజీ, సీపీ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసు అధికారులు భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో నిందితుడిని త్వరలోనే పట్టుకుని కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
constable murder case | ఆరో ఠాణా పరిధిలో రియాజ్ ఆనవాళ్లు..!
నిజామాబాద్ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్ .. స్థానిక కెనాల్ సమీపంలో లభించింది. దీంతో కెనాల్లో నుంచి దూకి నిందితుడు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రోన్ (Drone)ల సాయంతో నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు.