అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: constable murder case | నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యోదంతంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన రియాజ్ హతమైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.
రియాజ్‌ను నిజామాబాద్ ఆరో టౌన్ పరిధిలో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఈ పెనుగులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై నిందితుడు రియాజ్‌ను పట్టుకోని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. రియాజ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో పోలీసుల నుంచి వెపన్ లాక్కుని దాడికి యత్నించాడు. కాగా.. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడు రియాజ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియాజ్ హతమయ్యాడు.
ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరించారు. ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపారని తెలిపారు.