HomeUncategorizedAmit Shah | కాంగ్రెస్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Amit Shah | కాంగ్రెస్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amit Shah | ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు ఆయ‌న త‌ల్లిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప‌దే ప‌దే వ్య‌క్తిగ‌తంగా ప్ర‌ధానిని అవ‌మానిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

శుక్ర‌వారం అస్సాంలోని గౌహతిలో రాజ్ భవన్ బ్రహ్మపుత్ర విభాగాన్ని ప్రారంభించిన అనంత‌రం హోం మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రధాని మోదీని పదే పదే అవమానించిందని, ఆయనపై వ్యక్తిగత దాడులు చేస్తూనే ఉందన్నారు. కానీ ఈసారి కాంగ్రెస్‌ అన్ని పరిమితులను దాటిందని విమ‌ర్శించారు. ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన షా.. వెంట‌నే క్షమాపణ చెప్పాలని అన్నారు. “ప్రధాని మోడీ తల్లిపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం ద్వారా కాంగ్రెస్ నాయకులు అత్యంత ఖండించదగిన చర్యకు పాల్పడ్డారు. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను… ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రధాని మోదీపై అవమానకరమైన పదాలు మాట్లాడారు” అని కేంద్ర హోంమంత్రి పేరే్కొన్నారు.”ప్రధాని మోదీ(PM Modi) దివంగత తల్లి చాలా సరళమైన జీవితాన్ని గడిపింది – ఆమె తన పిల్లలను చాలా వినయపూర్వకంగా పెంచింది. వారిలో ఒకరు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్, ఆర్జేడీ ర్యాలీ వేదిక నుంచి ఆమెను దూషించ‌డమంటే అంతకు మించిన దిగజారుడు రాజకీయాలు ఉండవు” అని ఆయన అన్నారు.

Amit Shah | బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

ప్రధాని మోదీ, ఆయన తల్లిపై జరిగిన దుర్భాషలాడటంపై భారతీయ జనతా పార్టీ(BJP), కాంగ్రెస్ మధ్య శుక్రవారం మాటల యుద్ధం ప్రారంభమైంది. పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బీజేపీ నిరసన చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో రెండు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్ర‌మంలో మాట మాట పెరిగి కొట్టుకున్నారు. మ‌రోవైపు, ప్రధాని మోదీపై దుర్భాషలాడిన రఫీక్ అలియాస్ రాజా(Rafiq alias Raja)ను శుక్రవారం దర్భంగా పోలీసులు అరెస్టు చేశారు. మ‌రోవైపు, యూత్ కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ నౌషాద్(Mohammad Naushad) మోదీకి క్షమాపణలు చెప్పారు. ప్రధాని మోదీ, ఆయన తల్లిని రఫీక్ దుర్భాషలాడిన స‌మ‌యంలో తాను అక్క‌డ లేన‌ని పేర్కొన్నారు.

Must Read
Related News