HomeతెలంగాణKTR | అన్ని వర్గాలకు కాంగ్రెస్ ద్రోహం చేసింది : కేటీఆర్‌

KTR | అన్ని వర్గాలకు కాంగ్రెస్ ద్రోహం చేసింది : కేటీఆర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో పర్యటించారు.

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్ (BRS)​ పని చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తన అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ సతీమణి సునీత (Maganti Sunitha)ను ఎంపిక చేసింది. ఆమెను గెలిపించాలని కేటీఆర్​ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన షేక్​పేట (Shaikpet) సమత కాలనీలో ఇంటింటికి కాంగ్రెస్ బకాయి కార్డులను అందజేశారు.

KTR | రియల్​ ఎస్టేట్​ కోసమే..

కేటీఆర్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 హామీ ఏమైందని ప్రశ్నించారు. దొంగమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ KCR నాయకత్వం కోరుకుంటున్నారని చెప్పారు. ఫోర్త్ సిటీని కాదు ఉన్న సిటీని పట్టించుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం కోసమే సీఎం ఫ్యూచర్​ సిటీ (Future City) అంటున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల రూపంలో మంచి అవకాశం దొరికిందన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్​ రెండేళ్లు సమీపిస్తున్న ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కాంగ్రెస్​ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్​ 22 నెలల కాలంలో ప్రజలకు ఎంత బాకీ ఉందో వివరిస్తున్నామన్నారు. మహిళలకు రూ.2,500 ఇస్తామని రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారని ఈ లెక్కన రూ.55 వేలు బాకీ పడ్డారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్​ ప్రజలను లూటీ చేస్తోందని ఆయన విమర్శించారు.

Must Read
Related News