అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Congress | భీమ్‌గల్ మున్సిపాలిటీపై ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (DCC President Nagesh Reddy) అన్నారు. జిల్లాకేంద్రంలో ఆయన సమక్షంలో భీమ్‌గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality) 4వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు, మాజీ వీడీసీ క్యాషియర్ కాపు కుమ్మరి హరీష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.
Bheemgal Congress | ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూసి..
ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు (welfare schemes), అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC President Bomma Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మార్గదర్శకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భీమ్‌గల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన హరీష్‌తో పాటు సుమారు 30 మంది నాయకులు వార్డు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భీమ్‌గల్ మాజీ ఎంపీపీ సురేందర్, నాయకులు బైండ్ల మహేష్, మందుల కిరణ్, గంగాధర్, హరీష్, ప్రీతం, ప్రణయ్, రాములు, అశోక్, సురేష్, బాలయ్య, గంగన్న, సాయికిరణ్, నగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.