ePaper
More
    HomeతెలంగాణMP Arvind | కేసీఆర్ డైరెక్ష‌న్‌లో కాంగ్రెస్ కుట్ర‌లు.. ఎంపీ అర్వింద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

    MP Arvind | కేసీఆర్ డైరెక్ష‌న్‌లో కాంగ్రెస్ కుట్ర‌లు.. ఎంపీ అర్వింద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:MP Arvind | బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్(BRS President KCR) మార్గ‌ద‌ర్శ‌కత్వంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ సీనియ‌ర్ నేత అర్వింద్ ధ‌ర్మ‌పురి(Arvind Dharmapuri) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చ‌గొట్టేందుకు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు అంశాన్ని లేవ‌నెత్తుతున్నార‌ని తెలిపారు. వాస్త‌వానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నీళ్లు తీసుకెళ్లేందుకు అంగీకారం తెలిపిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో అర్వింద్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

    MP Arvind | కాంగ్రెస్ గ్రాఫ్ భూస్థాపితం..

    రాష్ట్రంలో 18 నెల‌ల పాల‌న చూసిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ(Congress Party) గ్రాఫ్ మొత్తం భూస్థాపిత‌మై పోయిందని అర్వింద్ తెలిపారు. ఇది ప‌నికి మాలిన ప్ర‌భుత్వ‌మ‌ని ప్ర‌జ‌లు నిర్ణ‌యానికి వ‌చ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల అమలులో విఫ‌ల‌మైందని విమ‌ర్శించారు. క‌నిక‌రం లేని ప్ర‌భుత్వం కాంగ్రెస్ ప్ర‌భుత్వమ‌ని, దివ్యాంగుల‌కు పింఛ‌న్లు పెంచ‌కుండా, ఫ్రీ బ‌స్ పాస్‌లు ఇవ్వ‌కుండా మోస‌గించింద‌న్నారు. చిన్న వాగ్దానాలు కూడా అమ‌లు చేయ‌లేని దుస్థితిలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress government) ఉంద‌న్నారు. నాడు బీఆర్ఎస్ పాల‌న‌లో, నేడు కాంగ్రెస్‌ పాల‌న‌లో అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అర్వింద్ తెలిపారు. టీఎన్జీవోల‌కు ఫేజ్‌-2లో ఇచ్చిన భూములు రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా కేసీఆర్ మోసం చేశార‌న్నారు. మ‌రోవైపు, టీఎన్జీవోల‌కు(TNGOs) కేటాయించిన భూమిలో ప‌ది ఎక‌రాలు లంచంగా ఇస్తేనే రిజిస్ట్రేష‌న్ చేస్తామ‌ని ఆనాడు కేటీఆర్ డిమాండ్ చేశార‌ని అర్వింద్ వెల్ల‌డించారు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల్లో అసంతృప్తిని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తుంద‌ని విమ‌ర్శించారు. అందులో భాగంగానే ఇప్పుడు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు(Banakacharla Project) అంశాన్ని తెరపైకి తీసుకొచ్చార‌ని మండిప‌డ్డారు.

    READ ALSO  Secunderabad | సికింద్రాబాద్​ డీఆర్​ఎంగా గోపాల కృష్ణన్​ నియామకం

    MP Arvind | ఉత్త‌మ్‌వి ఉత్త‌ర ప్ర‌గ‌ల్బాలే..

    మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy)కి ఉత్త‌ర ప్ర‌గ‌ల్బాలేన‌ని అర్వింద్ ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు నీళ్ల మీద‌, ప్రాజెక్టుల మీద క‌నీస అవ‌గాహ‌న లేద‌ని మండిప‌డ్డారు. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి స‌గం కాంగ్రెస్‌, స‌గం బీఆర్ ఎస్ నాయ‌కుడ‌ని విమ‌ర్శించారు. ఉత్త‌మ్ త‌న‌కు ఫోన్ చేశార‌ని, చంద్ర‌బాబు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నార‌ని, దీని వ‌ల్ల తెలంగాణ‌కు తీవ్ర ఇబ్బందులు వ‌స్తాయని, దీన్ని అడ్డుకోవడానికి క‌లిసి రావాల‌ని కోరార‌ని చెప్పారు. ఈ అంశంపై మీ ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక ఏమిటి? తెలంగాణ‌(Telangana)కు ఎన్ని నీళ్లు కావాలి? ఏమైనా ప్రాజెక్టులు అవ‌స‌ర‌మా? అని అడిగితే ఉత్త‌మ్ జ‌వాబు ఇవ్వ‌లేద‌ని చెప్పారు.

    MP Arvind | కేసీఆర్ వ‌ల్లే..

    వాస్త‌వానికి ఇవాళ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ(BRS Party)యే ఆనాడు ఏపీని నీళ్లు వాడుకోవాల‌ని చెప్పింద‌ని అర్వింద్ గుర్తు చేశారు. నాడు ఇద్ద‌రు సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్ క‌లిసి ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుకున్నారన్నారు. గోదావ‌రి, కృష్ణ‌, పెన్నా న‌దుల నుంచి నీళ్లు ఎత్తిపోసుకుని రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించేందుకు కేసీఆర్ ఆనాడు ఆమోదం తెలిపార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు గాయిగ‌త్త‌ర చేస్తున్న బీఆర్ఎస్ వాళ్లు ఏం స‌మాధానం చెబుతారని ప్ర‌శ్నించారు.

    READ ALSO  IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

    MP Arvind | ఎన్నిక‌ల కోస‌మే..

    బ‌న‌క‌చ‌ర్ల‌కు సంబంధించి కేంద్రం ఇంకా లాంటి చ‌ర్య‌లు తీసుకోలేదని అర్వింద్ వెల్ల‌డించారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు మీద ఇప్ప‌టిదాకా ఏపీ, తెలంగాణ మ‌ధ్య అధికార సమాచార మార్పిడి జ‌ర‌గ‌లేదని, కానీ, వీళ్లంతా కేసీఆర్ డైరెక్ష‌న్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ క‌లిసి కావాల‌నే ఈ అంశాన్ని తెర పైకి తీసుకొచ్చి సెంటిమెంట్‌ను ర‌గ‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌న్నారు. కేసీఆర్ డైరెక్ష‌న్ మేర‌కు తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిలించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. ఉత్త‌మ్ బీఆర్ ఎస్ చెప్పిన‌ట్లే వింటాడ‌ని, ఆయ‌న పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు కేసీఆర్ చెప్పినోళ్ల‌కే టికెట్లు ఇచ్చిండని విమ‌ర్శించారు. ఉత్త‌మ్‌కు క‌నీస అవ‌గాహ‌న లేదని, కేవ‌లం బీజేపీ ప్ర‌భుత్వం మీద బుర‌ద చ‌ల్ల‌డ‌మే కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప‌నిగా పెట్టుకున్నాయ‌న్నారు. బాబుకు రేవంత్(CM Revanth) ప్రియ‌మైన శిష్యుడు. ఆయ‌న మాట్లాడొచ్చు క‌దా. తెలంగాణ‌కు జ‌రిగే న‌ష్టాన్ని చంద్ర‌బాబు(Chandrababu)కు చెప్పిండా.. లిఖిత‌పూర్వ‌కంగా రాసిండా అంటే అదీ లేద‌న్నారు. కేవ‌లం మీటింగ్ కు పిలిచి బుర‌ద చ‌ల్లే ప్ర‌య‌త్నం చేయాల‌న్న‌దే కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప‌ని అని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో ఏ ఒక్క రైతుకు అన్యాయం జ‌ర‌గ‌నిచ్చే ప్ర‌శ్నేలేదని అర్వింద్ స్ప‌ష్టం చేశారు. సీడ‌బ్ల్యూసీతో పాటు గోదావ‌రి, కృష్ణా యాజ‌మాన్యాల బోర్డు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని చెప్పారు.

    READ ALSO  Nizamabad Collector | మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని కృషి

    MP Arvind | సిట్ నుంచి పిలుపురాలేదు..

    ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) అంశంపై విచార‌ణ జ‌రుపుతున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) నుంచి త‌న‌కు ఎలాంటి పిలుపు రాలేద‌ని అర్వింద్ విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ జ‌రుపుతున్న విచార‌ణ‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ అంశంపై సీబీఐ విచార‌ణ(CBI investigation) జ‌ర‌పాల‌న్న‌దే త‌న అభిప్రాయ‌మ‌ని, ఇదే విష‌యాన్ని బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డికి కూడా చెప్పాన‌న్నారు. దీనిపై పార్టీ లీగ‌ల్ సెల్ కోర్టులో పిటిష‌న్ వేస్తుంద‌న్నారు. మ‌రోవైపు, ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ పేరుతో రేవంత్‌రెడ్డి మంచి వ్యాపారం చేసుకుంటుండని తెలిపారు. ట్యాపింగ్ పేరుతో కేసీఆర్‌ను భ‌య‌పెట్టాలి, ఆయ‌న నుంచి డ‌బ్బులు తెచ్చుకోవాల‌న్న‌దే ఆయ‌న రేవంత్ ప్లాన్ అని పేర్కొన్నారు. మ‌హేశ్‌గౌడ్(PCC Cheif Mahesh Goud) సిట్ ముందు హాజ‌రైన అంశాన్ని విలేక‌రులు ప్రస్తావించ‌గా, ఆయ‌న ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తార‌ని ప్ర‌శ్నించారు. మ‌హేశ్‌గౌడ్ అప్ప‌ట్లో వ‌ర్క్ చేయ‌ని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌దా అని ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు పెద్ద‌గా రాజ‌కీయ అవ‌గాహ‌న లేదని, ఎన్న‌డూ ఎన్నిక‌లు గెలువ‌ని మ‌హేశ్‌ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిని చేశారని విమ‌ర్శించారు.

    Latest articles

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    More like this

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...