47
అక్షరటుడే, ఆర్మూర్: Panchayat Elections | గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందాంటే కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వినయ్‌కుమార్ రెడ్డి (Vinay Kumar Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఆలూర్ మండలంలో సోమవారం ప్రచారం నిర్వహించారు.
Panchayat Elections | కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
ఆలూరు మండలం దేగాం, డోంకేశ్వర్, మంథని, మచ్చర్ల గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్, వార్డు అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే (Congress government) సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేగం శ్రీనివాస్ గౌడ్, చుక్కల గంగాధర్, పెంటల ప్రభాకర్, బాంపల్లి చిన్న గంగాధర్, స్రవంతి సుమన్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.