Homeతాజావార్తలుIntermediate Education | ప్రణాళికతో ఇంటర్ సిలబస్​ను పూర్తి చేయాలి

Intermediate Education | ప్రణాళికతో ఇంటర్ సిలబస్​ను పూర్తి చేయాలి

ఇంటర్​ సిలబస్​ను త్వరగా పూర్తిచేసి ప్రాక్టికల్స్​కు సన్నద్ధం కావాలని డీఐఈవో రవికుమార్​ సూచించారు. ఈ మేరకు కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Intermediate Education | ఇంటర్ విద్యార్థులకు నవంబర్​లో సిలబస్ పూర్తి చేయాలని.. ప్రాక్టికల్స్​కు సన్నద్ధం కావాలని ఇంటర్ విద్యాధికారి (Education Officer) రవికుమార్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో కళాశాలల ప్రిన్సిపాళ్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల మరమ్మతుల (Government Colleges Repairs) కోసం కేటాయించిన నిధులను వినియోగించి సివిల్, ఎలక్ట్రికల్, ఫర్నిచర్ పనులను చేయాలన్నారు. అలాగే ప్రయోగశాలలకు కేటాయించిన నిధులతో అవసరమైన మెటీరియల్ సమకూర్చుకోవాలని సూచించారు.

త్వరలో ఇంటర్ విద్యార్థులు (Intermediate Students) పరీక్ష ఫీజు చెల్లించేందుకు బోర్డు తేదీలను ప్రకటిస్తుందని చెప్పారు. గతేడాది నిర్వహించిన 90 రోజుల ప్రణాళికను ఈసారి కూడా అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు. హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్​ (HRMS portal) ద్వారానే అధ్యాపకులు సెలవుల కోసం అనుమతి పొందాలన్నారు. ప్రధానంగా టీచింగ్ డైరీలను ఆన్​లైన్​లో పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు.