అక్షరటుడే, ఆర్మూర్: Human Rights Commission | ఆర్మూర్ పట్టణ ఎస్‌హెచ్‌వోపై మండలంలోని మచ్చర్ల గ్రామానికి (Macherla village) చెందిన పచ్చుక రాజేశ్వర్ ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో (Human Rights Commission) ఫిర్యాదు కాపీని అందజేశారు.
ఈ సందర్భంగా బాధితుడు పచ్చుక రాజేశ్వర్ మాట్లాడుతూ.. తన వ్యవసాయ భూమి విషయంలో కొందరు తనపై దాడి చేసిన విషయాన్ని ఆర్మూర్ పోలీసులకు (Armoor police) ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఫిర్యాదును తీసుకోకపోగా తనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తనను పోలీస్ స్టేషన్‌కు పిలిచి ఒకరోజు నిర్బంధించారన్నారు. దర్భాషలాడుతూ విచక్షణారహితంగా కొట్టారని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు తక్షణమే ఎస్‌హెచ్‌వోను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. అనంతరం మ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాట్లాడుతూ.. ఒకవైపు కోదాడ నియోజకవర్గంలో మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయం మరవకముందే ఆర్మూర్‌లో ఎలాంటి కేసు లేకున్నప్పటికీ అనుమానితుడనే పేరుతో రాజేశ్వర్‌ను ఎస్‌హెచ్‌వో చిత్రహింసలు పెట్టడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.