ePaper
More
    HomeతెలంగాణCabinet expansion | ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సారైనా మంత్రివర్గ విస్తరణ అయ్యేనా!

    Cabinet expansion | ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సారైనా మంత్రివర్గ విస్తరణ అయ్యేనా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet expansion | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నీతిఆయోగ్ (NITI Aayog)​ సమావేశంలో పాల్గొనడానికి సీఎం శుక్రవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం ఆయన నీతి అయోగ్​ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలపై చర్చించారు. అయితే సమావేశం అయిపోయినా.. రేవంత్​రెడ్డి హస్తినలోనే ఉండిపోయారు.

    Cabinet expansion | మంత్రివర్గ విస్తరణకు మోక్షం లభించేనా..

    రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)పై అనేక ఊహగానాలు వచ్చాయి. రేపు మాపు అంటూ 15 నెలలైనా కేబినెట్ విస్తరణ జరగలేదు. ఏప్రిల్​లో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్​ అధిష్టానం ఓకే చెప్పినా.. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు అడ్డుపడ్డట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్​రెడ్డి కేబినెట్‌ విస్తరణపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. పార్టీ కార్యవర్గం విస్తరణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్​రెడ్డి రాహుల్​గాంధీ(Rahul Gandhi), కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal)తో భేటీ కానున్నారు.

    Cabinet expansion | పదవులు ఎవరికో..

    పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్(PCC Chief mahesh goud)​ ఇటీవల మాట్లాడుతూ.. మే నెలాఖరు లేదంటే జూన్​ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రేవంత్​రెడ్డి ఢిల్లీలో ఇదే అంశంపై చర్చలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం మూడు మంత్రి పదవులు భర్తీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పదవులు ఎవరిని వరిస్తాయనే ఉత్కంఠ నెలకొంది.

    Cabinet expansion | ఆశావహుల ప్రయత్నాలు

    మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, వివేక్​ వెంకటస్వామి, ఆది శ్రీనివాస్​, మల్​రెడ్డి రంగారెడ్డి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డు పడ్డారని ఇటీవల రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలు కూడా చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఒకరికి పదవి ఇవ్వాల్సిందేనని మల్​రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు. వీరితో పాటు పలువురు కొత్త ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరికి పదవులు ఇస్తుందో చూడాలి.

    Latest articles

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    Education Department | విద్యాశాఖ ఉద్యోగిపై వేటు

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివాదాస్పదంగా మారిన జూనియర్ అసిస్టెంట్​పై ఉన్నతాధికారులు చర్యలు...

    PM Modi | చ‌ర్చ‌కు పట్టుబ‌ట్టి బొక్క బోర్లా ప‌డింది.. కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ విసుర్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆప‌రేష‌న్ సిందూర్‌పై పార్ల‌మెంట్‌లో చర్చకు ప‌ట్టుబ‌ట్టిన ప్రతిపక్షాలు బొక్క‌బోర్లా ప‌డ‌డంతో...

    Guvvala Balaraju | కేసీఆర్ వెళ్ల‌మంటేనే వెళ్లా.. ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై గువ్వ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో...

    More like this