అక్షరటుడే, వెబ్డెస్క్ : Candle Rally | పహల్గామ్ ఉగ్రదాడికి pahalgam terror attack నిరసనగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో Necklace Road శుక్రవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ candle rally నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి CM Revanth Reddy, మంత్రులతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా peoples plaza నుంచి నెక్లెస్ రోడ్ nekles road ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.
