అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Singer Chinmayi | సింగర్ చిన్మయ్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. చిత్ర పరిశ్రమలో మహిళలు కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయన్నారు. లేకపోతే ఛాన్స్‌లు ఇవ్వకుండా వేధిస్తారని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankar Varaprasad Garu) మూవీ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్నారు. ఫిలిం ఇండస్ట్రీ (Film Industry)అద్దం లాంటిదని ఆయన అన్నారు. మనం ఎలా ఉంటామో.. అలాంటి ఫలితాలు వస్తాయని చెప్పారు. నిక్కచ్చిగా ఉంటే ఎవరూ అవకాశం తీసుకోరని, క్యాస్టింగ్ కౌచ్‌లాంటివి ఉండవు అని చిరంజీవి చెప్పారు. కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఆయన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయ్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Singer Chinmayi | శరీరాన్ని అప్పగిస్తేనే..
క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలను చిన్మయి ఖండించారు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch)ఉందన్నారు. ఇక్కడ కమిట్మెంట్ అనే పదానికి అర్థం పూర్తిగా వేరని చెప్పారు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావన్నారు. అప్పట్లో నటీనటుల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి (Chiranjeevi) జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారన్నారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. గతంలో ఓ ప్రముఖ సింగర్ మహిళల్ని లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. అలంటి నేరస్థులేకే మళ్లీ రెడ్ కార్పెట్ వేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సైతం వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పారు. కొందరు కమిట్మెంట్ పేరిట మహిళల ఏవేవో ఆశిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు