ePaper
More
    HomeజాతీయంDattapeeta Express | దత్తపీఠ్​ ఎక్స్​ప్రెస్​గా.. చిక్కమంగళూరు - తిరుపతి రైలు.. మన రైళ్లకూ పేర్లు...

    Dattapeeta Express | దత్తపీఠ్​ ఎక్స్​ప్రెస్​గా.. చిక్కమంగళూరు – తిరుపతి రైలు.. మన రైళ్లకూ పేర్లు మార్చాలనే డిమాండ్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattapeeta Express | చిక్కమంగళూరు – తిరుపతి మధ్య నడిచే రైలుకు దత్తపీఠ్​ ఎక్స్​ప్రెస్​గా నామకరణం చేశారు. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఎంపీల ప్రతిపాదనకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav)​ ఆమోదించారు.

    దత్తపీఠ్ అనేది గురు దత్తాత్రేయ స్వామి(Guru Dattatreya Swamy) పేరు మీద వచ్చింది. అయితే ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి నడుస్తున్న 12762/61 కరీంనగర్ నుండి తిరుపతి నుండి కరీంనగర్ బైవీక్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా రాజరాజేశ్వర ఎక్స్​ప్రెస్ (Rajarajeshwara Express) పేరు పెట్టాలని కొంతకాలంగా ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ (12758/57 ) మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొమురంభీమ్ పేరు పెట్టాలనే ప్రతిపాదన కూడా ముందుకు కదలడం లేదు.

    కాజీపేట నుంచి బల్లార్షా మధ్య నడుస్తున్న 17036/35 ఎక్స్ ప్రెస్ రైలును కాకతీయ రాణి రుద్రమ దేవి పేరు పెట్టాలని కొంతకాలంగా డిమాండ్ ఉంది. కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ మధ్య నడుస్తున్న పుష్ పుల్ రైలుకు మానేరు పుష్ పుల్ పేరుతో నడపాలనే ప్రతిపాదన కూడా ముందుకు కదలడం లేదు. పండరిపూర్ నుంచి నిజామాబాద్​ మధ్య నడుస్తున్న రైలుకు విఠలేశ్వర ఎక్స్ ప్రెస్​గా నామకరణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో మన చారిత్రక కట్టడాలు, గుళ్లు, నదులు, చరిత్ర కారుల పేరుతో రైళ్లను నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలని కోరుతున్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...