ePaper
More
    Homeటెక్నాలజీChatGPT in WhatsApp | వాట్సప్ లో చాట్ జీపీటీ.. ఇమేజ్​ జనరేషన్​ ఆప్షన్​ ఎలా...

    ChatGPT in WhatsApp | వాట్సప్ లో చాట్ జీపీటీ.. ఇమేజ్​ జనరేషన్​ ఆప్షన్​ ఎలా అంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ChatGPT in WhatsApp : వాట్సప్​ వినియోగదారులకు శుభవార్త. ఈ సంస్థ తన ఖాతాదారులకు అధునాతన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఓపెన్ AI చాట్​బాట్​ చాట్ జీపీటీని (open AI chatbot ChatGPT) ఇమేజ్ జనరేషన్ ఫీచర్ తాజాగా వాట్సప్ లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటి వరకు ChatGPT వెబ్, మొబైల్ యాప్ లలో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా వాట్సప్ లో 1-800-ChatGPT ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ‘X’ ద్వారా కంపెనీ ప్రకటించింది.

    “చాట్ జీపీటీని వాట్సప్ లోని 1-800-ChatGPTకి లింక్​ చేసి మరిన్ని ఇమేజ్​లు జనరేషన్ చేసుకోవచ్చు. గత డిసెంబరులో చాట్​బాట్​ను వాట్సప్ ద్వారా యాక్సెస్ కు అనుమతి లభించింది. 1-800-ChatGPT అని పిలిచే ఈ ప్రయోగాత్మక సర్వీస్ ఖాతా.. చాట్ జీపీటీని మరింత యాక్సెస్ పొందేలా అనుమతిస్తోంది.

    వాట్సప్ లో చాట్ జీపీటీ ఎలా వినియోగించాలంటే..

    • ఫోన్ కాంటాక్ట్ లలో 1-800-ChatGPT అధికారిక నంబరు +1-800-242-8478 సేవ్ చేసుకోవాలి.
    • తర్వాత WhatsApp ఓపెన్ చెయ్యాలి. అనంతరం ఆ నంబరు​కు “హాయ్” అని మేసేజ్ చెయ్యాలి.
    • అనంతరం Open Al ఖాతాను ధృవీకరించమని అడుగుతుంది. అలా లాగిన్ అవ్వడానికి లింక్​ను ఫాలో కావాలి.
    • లింక్ చేశాక.. ఏ ఇమేజ్ కావాలంటే దాని కంటెంట్ ఇచ్చి ఇమేజ్​ను సృష్టించుకోవచ్చు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...