Homeఅంతర్జాతీయంH-1B Visa | భార‌తీయుల‌కు ట్రంప్ మ‌రో షాక్‌.. హెచ్‌-1బీ వీసాల్లో మ‌ళ్లీ మార్పులు

H-1B Visa | భార‌తీయుల‌కు ట్రంప్ మ‌రో షాక్‌.. హెచ్‌-1బీ వీసాల్లో మ‌ళ్లీ మార్పులు

H-1B Visa | అమెరికాకు వెళ్లాల‌నుకుంటున్న వారికి ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ వీసాల జారీ విష‌యంలో మ‌రిన్ని క‌ఠిన నిబంధ‌న‌లు రూపొందించే ప‌నిలో ప‌డ్డారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : H-1B Visa | అమెరికాకు వెళ్లాల‌నుకుంటున్న వారికి ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మ‌రోసారి షాక్ ఇచ్చారు. వీసాల జారీ విష‌యంలో మ‌రిన్ని క‌ఠిన నిబంధ‌న‌లు రూపొందించే ప‌నిలో ప‌డ్డారు.

ఇప్ప‌టికే వీసాల‌ విషయంలో కీల‌క మార్పుల మార్పులు చేసిన ట్రంప్‌.. ఇటీవల హెచ్‌-1బీ వీసా(H-1B Visa) విషయంలో లక్ష డాలర్ల ఫీజు విధించారు. ఇప్పుడు ఈ వీసా విషయంలో మరికొన్ని మార్పులు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. రిఫార్మింగ్‌ ద హెచ్‌-1బీ నాన్‌ఇమిగ్రెంట్స్‌ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్‌ కింద ఈ కొత్త మార్పులు తీసుకురానున్నట్లు ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదైనట్లు తెలుస్తోంది. అయితే వీసా పరిమితి మినహాయింపుల అర్హతను బట్టి కఠినం చేయనున్నారు. అలాగే వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై కూడా దృష్టి పెట్టనున్నారు.

H-1B Visa | భారతీయ విద్యార్థులపై ఎఫెక్ట్..

తాజా ప్ర‌తిపాద‌న‌లు అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశించే వేలాది మంది భారతీయ విద్యార్థులు(Indian Students), యువ నిపుణులకు ఆందోళన కలిగిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా కార్యక్రమంపై సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వీసా రుసుము పెంపు ప్రతిపాదనలతో ఆందోళన నెలకొనగా, తాజాగా వీసాల జారీ, వినియోగం, అర్హత ప్రమాణాలపై మరిన్ని కఠిన నిబంధనలను విధించేందుకు సిద్ధమవుతుండ‌డం భార‌తీయ విద్యార్థుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, భారతీయ నిపుణుల అమెరికా(America) కల మరింత సంక్లిష్టంగా మారనుంది.

H-1B Visa | అమెరిక‌న్ల‌కు మేలు చేసేలా..

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్), ‘హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా వర్గీకరణ కార్యక్రమ సంస్కరణ’ పేరిట ఫెడరల్ రిజిస్టర్‌లో కొత్త ప్రతిపాదనలను నమోదు చేసింది. ఈ ప్రతిపాదనల ముఖ్య ఉద్దేశం అమెరికా కార్మికుల వేతనాలు, పని పరిస్థితులను మెరుగ్గా పరిరక్షించడం, హెచ్-1బీ కార్యక్రమ సమగ్రతను పెంచడమ‌ని ప్రభుత్వం పేర్కొంది. సంస్కరణల్లో భాగంగా వీసా నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై మరింత నిఘా పెట్టడం, థర్డ్-పార్టీ ప్లేస్‌మెంట్‌లను కఠినంగా పర్యవేక్షించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ కొత్త రూల్ వల్ల విశ్వ విద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, హెల్త్ కేర్ సంస్థలు ప్రయోజనాలను పొందలేవు. అలాగే అమెరికా వెళ్లి చదవాలని అనుకుంటున్న ఎందరో భారతీయ విద్యార్థుల కల నెరవేరదు. అయితే ఈ కొత్త నిబంధనలు అన్ని కూడా ఈ ఏడాది డిసెంబర్‌లో వెలువడే అవకాశం ఉంది.