ePaper
More
    HomeసినిమాBala Krishna | బాల‌య్య‌ని ఆకాశానికి ఎత్తేసిన చంద్ర‌బాబు, లోకేష్ .. ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌జేసిన...

    Bala Krishna | బాల‌య్య‌ని ఆకాశానికి ఎత్తేసిన చంద్ర‌బాబు, లోకేష్ .. ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌జేసిన ప‌వన్ క‌ళ్యాణ్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bala Krishna | సినీ రంగంలో 50 ఏళ్ల విజయయాత్రను పూర్తి చేసిన నందమూరి బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బంగారు ఎడిషన్‌(World Book of Records Gold Edition)లో చోటు లభించడం తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణంగా మారింది. ఈ అరుదైన ఘనతపై బాలయ్యకు సినీ, రాజకీయ రంగాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రివర్గ సభ్యుడు మరియు బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్(Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ .. “సినీ రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు బాల మావయ్యకు హృదయపూర్వక అభినందనలు. లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల‌డ్డ్‌ ఎడిషన్‌లో ఆయనకు స్థానం లభించడం మా కుటుంబానికి మాత్రమే కాదు, తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ గర్వకారణం. ఆయన ప్యాషన్, క్రమశిక్షణ, కళ పట్ల ప్రేమ మనందరికీ స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

     Bala Krishna | బాల‌య్య‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం..

    అలానే బాలకృష్ణ(Bala Krishna) కుమార్తె నారా బ్రాహ్మణి కూడా తండ్రిపై గర్వం వ్యక్తం చేస్తూ,”మా నాన్న నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. లీడ్ హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అరుదైన గుర్తింపు పొందారు. ఆయన ఒక ప్రకృతి శక్తి, తెరపై ఐకాన్ మాత్రమే కాకుండా, ఒక ఉత్తమ నాయకుడు కూడా. ఈ గ్లోబల్ గుర్తింపు మా కుటుంబానికి గర్వకారణం” అని పోస్ట్ చేశారు.ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు(AP CM Chandrababu Naidu) కూడా బాల‌య్య‌కి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. తరతరాలుగా ప్రజలచే ఆరాధించబడిన నటుడు, సినిమా పట్ల అంకితభావం కలిగిన బాల‌య్య 50 సంవ‌త్స‌రాల పాటు లీడ్ హీరోగా చేసిన ప్ర‌యాణం అసాధార‌ణం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందిన‌ మన బాలయ్యకు అభినందనలు అని చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.

    ఇక తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Depputy CM Pawan Kalyan) త‌న ఎక్స్‌లో.. బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అని కొనియాడారు. ఇదిలా ఉండగా, మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర తదితరులు బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ గౌరవం యావత్ తెలుగు జాతికి గర్వకారణమని వారు వ్యాఖ్యానించారు.

    Latest articles

    Cardiac Arrest | సిక్స‌ర్ కొట్టాక గుండెపోటుతో కుప్ప‌కూలిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cardiac Arrest | ఇటీవల ఆటలు ఆడుతూ, వ్యాయామాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయే ఘటనలు...

    ASHA Workers | చావుకు వెళ్తే మృతదేహంతో ఫొటో దిగి పెట్టాలట.. కలెక్టరేట్​ ఎదుట ఆశాల ధర్నా

    అక్షరటుడే, కామారెడ్డి: ASHA Workers | అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు చనిపోయారని...

    Nagar Kurnool | రాంగ్​నంబర్​లో కనెక్టయి పెళ్లి.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagar Kurnool | వారిద్దరు రాంగ్​ నంబర్​లో కనెక్ట్​ అయ్యారు. అనంతరం ప్రేమించి వివాహం...

    Smart Ration Cards | ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం.. సెప్టెంబర్ 15 నాటికి 1.46 కోట్ల కుటుంబాలకు పంపిణీ లక్ష్యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Ration Cards | ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు స్మార్ట్...

    More like this

    Cardiac Arrest | సిక్స‌ర్ కొట్టాక గుండెపోటుతో కుప్ప‌కూలిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cardiac Arrest | ఇటీవల ఆటలు ఆడుతూ, వ్యాయామాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయే ఘటనలు...

    ASHA Workers | చావుకు వెళ్తే మృతదేహంతో ఫొటో దిగి పెట్టాలట.. కలెక్టరేట్​ ఎదుట ఆశాల ధర్నా

    అక్షరటుడే, కామారెడ్డి: ASHA Workers | అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు చనిపోయారని...

    Nagar Kurnool | రాంగ్​నంబర్​లో కనెక్టయి పెళ్లి.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagar Kurnool | వారిద్దరు రాంగ్​ నంబర్​లో కనెక్ట్​ అయ్యారు. అనంతరం ప్రేమించి వివాహం...