అక్షరటుడే, కోటగిరి: Chain Snatching Kotagiri | జిల్లాలో వరుస చైన్‌స్నాచింగ్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు. బంగారం ధర (Gold Prices) పెరుగుతూ పోతుండటంతో బంగారు ఆభరణాలకు రక్షణ లేకుండా పోతోంది.
Chain Snatching Kotagiri | ముఖానికి మాస్కులు ధరించి..
ముఖానికి మాస్కులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటన కోటగిరి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో మహిళలు భయాందోళన చెందుతున్నారు.
మండలంలోని వినాయక్‌నగర్‌లో..
ఎస్సై సునీల్ (SI Sunil) తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ (Vinayaka Nagar)కు చెందిన ఏముల లింగవ్వ (65) 25న రాత్రి ఇంట్లో ఒక్కరే ఉండగా.. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి గోడదూకి వచ్చి వృద్ధురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
